అలగనూరుకు నిధులు మంజూరు చేయండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:24 AM
అలగనూరు రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులను వెంటనే చేపట్టేందుకు నిధులను మంజూరు చేయా లని రాష్ట్ర మంత్రి నారా లోకేశకు మైదుకూరు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ వినతి పత్రం అందజే శారు.
మైదుకూరు రూరల్,సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి) : అలగనూరు రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులను వెంటనే చేపట్టేందుకు నిధులను మంజూరు చేయా లని రాష్ట్ర మంత్రి నారా లోకేశకు మైదుకూరు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ వినతి పత్రం అందజే శారు. మంగళవారం మంత్రి నారా లోకేశ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావే శంలో, నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారని పుట్టా తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మైదుకూరు పర్యటనలో ఇచ్చి న హామీలను నెరవేర్చేందకు నిధులను మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ పనులు పూర్తి అయితే, 92 వేల ఎకరాలకు సాగునీరు, అలాగే పలు గ్రామాలకు తాగునీరు కూడా అందుతుందని తెలిపారు. ఈ నీటితో మైదుకూరు నియోజకవర్గంలోన్తి రైతులు రెండుకార్ల పంటలను పండించుకోవచ్చని తెలిపారు.
పుట్టాను కలిసిన సచివాలయం ఉద్యోగులు : ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ను సచివాలయ ఉద్యోగులు కలిసి కోరారు.ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో ప్రభు త్వ ఉద్యోగుల సంఘం మైదుకూరు తాలుకా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసిం హాప్రతాప్‌లు కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో హర్షవర్థన్‌రాజు, వినీత్, వెంకటయ్య, సతీష్, సురేంద్ర, రాజావలి తదితరులు పాల్గొన్నారు.