వైభవంగా అంకాలమ్మ రక్తకపిలి
ABN , Publish Date - May 12 , 2025 | 11:47 PM
అంకాలమ్మ తిరునాళ్లలో భాగంగా సోమవారం రక్తకపిలి వైభవంగా నిర్వహించారు.
రైల్వేకోడూరు,మే 12(ఆంధ్రజ్యోతి): అంకాలమ్మ తిరునాళ్లలో భాగంగా సోమవారం రక్తకపిలి వైభవంగా నిర్వహించారు. ఆలయం ఆవరణంలో పెద్ద అమ్మవారి ముగ్గు వేసి అమ్మవారికి మేకను సమర్పించారు. ఆ రక్తాన్ని అన్నంలో కలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని వీధుల వెంబడి చల్లుకుంటూ నోటికి మేక దొమ్మను పట్టుకుని ఊరేగింపుగా వెళ్లి ప్రతి ఏటా నిర్వహించే స్థలంలోనే పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేశారు.