విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:38 PM
విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుం టోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ పండుగ వాతావరణంలో పాఠశాలలు, కళాశాలల్లో పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు
జమ్మలమడుగు/ఎర్రగుంట్ల/ మైలవరం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుం టోందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు మండలంలోని గూడెం చె రువు ఉన్నత పాఠశాల, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశంలో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రిన్సిపాల్ ప్రణీత కస్తూర్బాగాంధీ పాఠశాలలో నీటి సమస్య ఉందని తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించేందుకు వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హాజరైన టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలతోపాటు వసతి గృహాలకు మంచి సౌకర్యాలుకల్పించామని, విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో సైదున్నీసా, ఎంఈవో చంద్రశేఖర్‌రావు, కూటమి నాయకులు గోనా పురుషోత్తంరెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, సర్పంచ్ నాగేశ్వరి, పొన్నతోట శ్రీను, గౌస్ అహమ్మద్, శివారెడ్డి, ప్రదీప్‌శ్రీను, ఉపాధ్యాయులు గురుకుమార్‌ఉన్నారు.కాగా మైలవరం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముఖ్య అతిఽథిగా పాల్గొనగా దొమ్మరనంద్యాల ఉన్నత పాఠశాలలో ఆర్డీవో సాయిశ్రీ పాల్గొని ప్రసంగించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తహసీల్దారు లక్ష్మినారాయణ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహకం ఎంతో అవసరమన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి, ఎంఈవో చిట్టిబాబు, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, మైలవరం కళాశాల ప్రిన్సిపాల్, హైస్కూలు హెచ్‌ఎం నరసమ్మ, ప్రభావతమ్మ, ఉపాధ్యాయులు మధుసూదన్‌రావు, రామలక్షుమ్మ, జయలక్ష్మి, విష్ణు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగుంట్ల బాలు ర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల, విద్యార్థుల తల్లి దండ్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన టీడీపీ ఇనచార్జి సి.భూపేస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కలు అందజేసి వాటిని పెంచాల్సిన బాద్యత ప్రతి విద్యార్థి తల్లిదండ్రు లపై ఉందన్నారు. భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంద రికి తల్లికి వందనం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ కలెక్టర్ కిరణ్‌కుమార్, మున్సిపల్ ఛైర్మన ఎం.హర్షవర్దనరెడ్డి, మండల ఇనచార్జి మధుసూధనరెడ్డి, తహసీల్దార్ శోభన బాబు, ఎంపీడీవో వెంకటరమణ, కమిషనర్ శేషఫణి, మాజీ ఏఎంసీ ఛైర్మన సూర్యనా రాయణరెడ్డి, మాజీ సర్పంచి రవిప్రసాద్‌రెడ్డి, హెచఎం. రామాంజనేయరెడ్డి, విద్యాకమిటీ ఛైర్మన ముస్మిన వల్లి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డిలు మధ్యాహ్నం భోజనం చేశారు. జూనియర్ కళాశాలలో జరి గిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది, భూపేష్ పా ల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ త్రివిక్రమరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఘనంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
ప్రొద్దుటూరు టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశం పాఠశాలల్లో పండుగలా సాగింది. మండలంలోని 110 ప్రభుత్వ పాఠశాలలు, 125 ప్రైవేటు పాఠశాలలతోపాటు రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కబడ్డీ, టగ్‌ఆఫ్ వార్, ఖోఖో, మ్యూజికల్ ఛైర్స్, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. వైవీఎస్ మున్సిపల్ గల్ల్ ్స హైస్కూలులో జరిగిన సమావేశానికి డిప్యూటీ డీఈవో యు.మీనాక్షి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయయుడు విజయభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బద్వేలులో: పట్టణంలోని బద్వేలు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల లో గురువారం మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం మ్యూజికల్ చైర్, లెమన స్పూన వంటి ఆటల పోటీలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో తహశీల్దారు ఉదయభాస్కర్‌రాజు, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, వార్డు కౌన్సిలర్ పద్మావతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి, సెక్రటరీ భారతి ,స్కౌట్‌మాస్టర్ శివ ప్రసాద్, రామచంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.