Share News

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మంచిరోజులు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:03 AM

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మంచిరోజులు రానున్నాయని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి అన్నారు.

కడప ఉక్కు పరిశ్రమ  ఏర్పాటుకు మంచిరోజులు
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

మహానాడులో సీఎం ప్రకటన హర్షణీయం ఫ టీడీపీ నేత భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, మే 31 (ఆంధ్రజ్యోతి):కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మంచిరోజులు రానున్నాయని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి అన్నారు. కడపలో మహానాడు పసుపు పండుగలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జమ్మలమడుగులో జూన్‌ నెల 12వ తేదీ లోపు ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. శనివారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడు సభకు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చి మహానాడు సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, రాయల్‌ కిరణ్‌, కర్నాటి రామాంజనేయరెడ్డి, పొన్నతోట శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:03 AM