జమ్మలమడుగు ఆస్పత్రికి చికిత్స చేయండి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:08 AM
జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప చికిత్స చేయాలని ప్రజలు కోరుతు న్నారు.

తీరుమారని ప్రభుత్వ వైద్యులు వైద్య చికిత్స కోసం పడిగాపులుగాస్తున్న రోగులు పట్టించుకోని అధికారులు
జమ్మలమడుగు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప చికిత్స చేయాలని ప్రజలు కోరుతు న్నారు. ఎన్నిసార్లు వైద్యుల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గంటల తరబడి వేచిచూస్తున్న వారిలో మా ర్పు కనిపించడంలేదు. దీంతో రోగుల ఇక్కట్లు వర్ణణాతీతంగా మారాయి. ఇందుకు నిదర్శనంగా ఆదివారం ఉదయం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వివిధ గ్రామాల నుంచి రోగులు వైద్య చికిత్సల కోసం వచ్చారు. అయితే ఉదయం 9 గంటల నుంచి డాక్టర్లు విధులకు హాజరుకావాల్సి ఉండగా 10.45 గంటల వరకు డాక్టర్లు ఎవరు లేక వచ్చిన రోగులు పడిగాపులు కాశారు. ఈ సమస్య విషయమై ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రఫిక్‌పాషాను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆదివారం కావడం వలన డాక్టర్లు రాలేదని తెలిపారు. వెంటనే ఆయన చాంబర్ వద్ద నుంచి వచ్చి రోగులకు స్వయం గా వైద్యం అందించడం ప్రారంభించారు. కాగా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ సమస్య ఉందని, ఆ గదికి తాళం వేశారని ఆస్పత్రిలోని సమస్యలన్నింటిని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.