Share News

లేబర్‌ కోడ్‌ల రద్దు కోరుతూ సార్వత్రిక సమ్మె

ABN , Publish Date - May 03 , 2025 | 11:12 PM

కార్మికుల హక్కులను హరించే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20, 21, 22 తేదీలలో సార్వత్రిక సమ్మె నిర్వహి స్తున్నట్లు సీఐ టీయూ నాయకులు తెలిపారు.

లేబర్‌ కోడ్‌ల రద్దు కోరుతూ సార్వత్రిక సమ్మె
మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

బద్వేలు, మే 3 (ఆంధ్రజ్యోతి)ః కార్మికుల హక్కులను హరించే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20, 21, 22 తేదీలలో సార్వత్రిక సమ్మె నిర్వహి స్తున్నట్లు సీఐ టీయూ నాయకులు తెలిపారు. ఆ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందించా రు. అనంతరం యూనియన జిల్లా అధ్యక్షుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ రా ష్ట్రంలో ఆప్కాస్‌ సంస్థను రద్దు చేసి ప్రైవేటు ఏజన్సీలకు కార్మికులను అప్పగించా లనే ప్రభుత్వ నిర్ణయం ఉప సంహరించుకోవాలన్నారు. జీవో 36 ప్రకారం జీతాలు పెంచడంతోపాటు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్యాంప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు హరి, ఉపాధ్యక్షుడు గంటా శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:12 PM