Share News

కల్లుట్లలో ఘనంగా గంగమ్మ జాతర

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:15 PM

మండల పరిధిలోని కల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ జాతరను గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కల్లుట్లలో ఘనంగా గంగమ్మ జాతర
గంగమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

మైలవరం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ జాతరను గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఖాజీపేటలో అంకాళమ్మ తల్లికి బోనాలు

ఖాజీపేట, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుడుమలదిన్నె, అగ్రహారం గ్రామాల్లో ఆదివారం అంకాలమ్మ తల్లికి భక్తులు ఘనం గా బోనాలు సమర్పించారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజుల క్రితం సందర్భంగా రెండు గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు సమర్పించడం వలన గ్రామంలో పాడిపంటలు బాగా పండి ప్రజలను చల్లంగా చూస్తుందని భక్తుల నమ్మకం

వైభవంగా పల్నాడు తల్లి ఉత్సవాలు

బి.కోడూరు, జూన 1 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రాజుపాలెంలో వెలసిన పురాతన పల్నాడు అంకాల మ్మ తల్లి 9 రోజుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కోలాటం పోటీలు, గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30వేలు, అలాగే 4న ఆర్రెసా్ట్ర పాటకచేరి, 5వతేదీన కులుకు భజన పోటీలు అందులో గెలుపొందినవారిని మొదటి బహుమతి 75వేలు, ద్వితీయ 50వేలు 6వతేదీన బండలాగుడు పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. లక్ష, రెండో బహుమతి రూ.80వేలు, మూడోబహుమతి 60వేలు, నాలుగో బహుమతి రూ.40వేలుగా ఇవ్వను న్నట్లు గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా 6న ఉత్కంఠ భరితంగా సాగే కంపకల్లి రణం కొలువులు ముళ్లకం పపై భక్తులు దొర్లుట జరుగుతుంది. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:15 PM