గంగ ఒడికి గణనాథులు
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:54 PM
వినాయక చవితి వేడుకలు సందర్భంగా ఆదివా రం నాటికి ఐదు రోజుల పాటు పూజలందు కున్న గణనాథులు గంగ ఒడికి చేరుకున్నారు.
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలు సందర్భంగా ఆదివా రం నాటికి ఐదు రోజుల పాటు పూజలందు కున్న గణనాథులు గంగ ఒడికి చేరుకున్నారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ, సాయిరాజేశ్వరి కాలనీ, నేతాజీనగర్, సూపర్‌బజార్‌రోడ్డు, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, మిట్టమడి, బొల్లవ రం ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి ట్రాక్టర్లలో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం కొన్ని ఉత్సవ కమిటీల నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. బాణసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాలతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ జై బోలో గణేష్ మహరాజ్‌కి జై అంటూ స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించి రామేశ్వరంలోని పెన్నానదిలో, కామనూరు, చాపాడు వద్ద కుందూ నదిలో నిమజ్జనం చేశారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగులో ఆదివారం పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని మెయిన్‌బజార్‌లో ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మహిళలు, విద్యార్థినులు రంగులు చల్లుకున్నారు.
మైదుకూరు రూరల్‌లో : మైదుకూరు మున్సి పాలిటీ, మండల పరిధిలో ఆదివారం ఐదో రోజు వినాయక విగ్రహాలను కుందూ నదిలో నిమజ్జనం చేశారు. కుందు నదివైపు సాగాయి. పట్టణంలోని పాతూరు విగ్రహం వద్ద డీఎస్సీ పరీక్షలో కరిడి బాలాజీకి ఏడు స్టేట్ ఫస్ట్‌లు రావడంతో రామాలయం వీధి కమిటీ సభ్యులు శాలువతో సన్మానం చేశారు. డీఎస్పీ రాజేంద్రప్ర సాద్, సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐ చిరంజీవిలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రాజుపాలెంలో : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం వినాయకుని నిమజ్జనం ఘనంగా జరిగింది. రాజుపాలెంలో సంప్రదాయ బద్ధంగా ఆ కాలనీవాసులు కోలాటం చేస్తూ వినాయకున్ని తరలించగా టంగుటూరులో ఎడ్ల బండిపై వినాయకున్ని ఏర్పాటు చేసి ఊరేగించి టంగుటూరు, వెల్లాల వద్ద కుందూలో విగ్రహా లు నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు, ఎలక్ర్టిసిటీ వారు ఏర్పాట్లు చేశారు.
బద్వేలు/రూరల్‌లో: నియోజకవర్గ వ్యాప్తంగా 5వ రోజు ఆదివారం వినాయక నిమ జ్జన కార్య క్రమం అంగరంగ వైభవంఙగా నిర్వ హించారు. పట్టణంలోని కొండారెడ్డి వీధిలో ఏర్పాటుచేసిన వరసిద్ది వినాయక స్వామివారి లడ్డూ, చెరకుగ డలు, కలశం చెంబు, కుంకు మభరిణె, నోట్ల దండలు వేలంపాట నిర్వహించారు. ఇందులో బి. శ్రీనివాసులు రెడ్డి 90వేలకు లడ్డ్డూను కైవసం చేసుకున్నారు. చెక్కభజన, కోలాహలం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కొండాపురంలో: కొండాపురం పట్టణంతో పాటు, గండ్లూరు తదితర గ్రామలకు చెందిన విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేశారు. కొం డాపురం పట్టణంలో 21 అడుగుల వినా యక విగ్రహం వద్ద సత్రసాల రాఘవేంద్ర రూ.91వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నా రు. పలు చోట్ల అన్నదానం నిర్వహించారు. అనంతరం గండికోట బ్యాక్‌వాటర్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహంచారు.
ముద్దనూరులో:మండలంలో వినాయక చవితి పండుగ వినాయక విగ్రహాల వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.కొత్తకొట్టాలు వీధిలో గురు ట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎస్‌వీఆర్ ట్రాన్స్‌పోర్టు అధినేత వరదారెడ్డి,డాక్టర్ నవజ్యోత్‌రెడ్డి పాల్గొన్నారు.సాయంత్రం వినాయకులు నిమజ్జనానికి తరలివెళ్లారు.
చాపాడులో: మండలంలోని సీతారామపురం గ్రామం వద్ద కుందూ నదిలో భక్తులు వినాయక విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేశారు. రాజుపాళెం, వెదురూరు, అన్నవరం, సోమాపురం, చిన్నగురవలూరు, లక్ష్మిపేట, అల్లాడుపల్లె తదితర అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ట్రాక్టర్ల మీద ఊరేగింపుగా వచ్చి కుందూలో నిమజ్జనం చేశారు.
ఖాజీపేటలో: మండల పరిధిలోని ప్రతి పల్లెల్లో వినాయక చవితిని పురష్కరించుకుని 180 విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే మూడవ రోజు, 4వ రోజు వంద విగ్రహాలను నిమజ్జనం చేయగా 5వ రోజు 80 విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. అయిదు రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అన్నదానాలు ఏర్పాటు చేయడంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఘర్షణలు జరుగకుండా సీఐ వంశీధర్ బందోబస్తు ఏర్పాటుచేశారు.
కలసపాడులో: మండలంలో ఆదివారం 5వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సా హాల మధ్య భక్తులు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి కోలాహలంగా లడ్డు, చెరకు గడలు, కలశంచెంబుల వేలం పాటలతో కార్యక్ర మం ప్రారంభమైంది. కలసపాడు, ఎగువరామా పురం, తెల్లపాడు,చెన్నపల్లె, ముస ల్‌రెడ్డిపల్లె, అక్కివారిపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 35 విగ్రహాలకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించా రు. కోలాటాలు, చెక్కభజనలు, డప్పువాయిధ్యా లతో మహిళలు, చిన్నపిల్లలు సైతం రంగులు చల్లుకుంటూ నిమజ్జనంలో పాల్గొన్నారు. ఎలాం టి అవాంచనీయ సంఘటనలు జరగకుం డా ఎస్‌ఐ తిమోతి తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
ముద్దనూరులో:మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కొలువు దీరిన వినాయకుల వద్ద ఆదివారం అన్నదానాలు నిర్వహించారు.కొత్తకొట్టాలు వీధిలో గురు ట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌వీఆర్ ట్రాన్స్‌పోర్టు అధినేత వరదారెడ్డి,డాక్టర్ నవజ్యోత్‌రెడ్డి పాల్గొన్నారు.సాయంత్రం వినాయకులు నిమజ్జనానికి తరలివెళ్లారు.
పోరుమామిళ్లలో : గణనాథుని విగ్రహాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఊరే గింపుగా తీసుకువెళ్లి మల్లకతవలో నిమజ్జనం చేశారు. పోరుమామిళ్ల, రంగ సముద్రం పంచాయతీల్లో ఏర్పాటు చేసిన 66 గణనాఽథులను ఆదివారం నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ యనమల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాం ఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ శ్రీనివా సులు, ఎస్‌ఐ కొండారెడ్డి, మల్లకతవ వద్ద విద్యుత ఏఈ అగ్నిమాపక అధికారులు, రెవెన్యూ సిబ్బంది, చర్యలు తీసు కున్నారు.
బి.కోడూరులో: మండల పరిఽఽధిలోని గోవిం దాయపల్లె, రెడ్డివారిపల్లె, మున్నెల్లి, అమ్మ వారి పేట మరో పది గ్రామాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. గోవిందాయపల్లె గ్రామంలో వినాయ కుని లడ్డూ వేలంపాట లో రూ.51వేలకు వెంగల విజయకుమార్‌రెడ్డి దక్కించుకోగా, రెడ్డివారిపల్లెలో రూ.55వేలకు రామక్రిష్ణారెడ్డి దక్కిం చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ వెంకటసురేశ తన సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు.
కాశినాయనలో:వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం నర్సాపురం, ఉప్పలూరు, బాలాయపల్లె, ఆకులనారాయ ణప ల్లె ,బాలరాజుపల్లె తదితర గ్రామాల్లో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల నడు మ సాగింది. గణేశ మండపాలవద్ద లడ్డూ వేలం పోటాపోటీగా సాగాయి. ఉప్ప లూరు లో రూ60,000, నర్సాపురం సెంటర్‌లో రూ.40 వేలు, బాలరాజుపల్లెలో రూ.49వేలు .నర్సాపురం రెడ్డిగారి వీధిలో కలశం రూ.75000 పలికింది.