Share News

గాలీవాన బీభత్సం

ABN , Publish Date - May 15 , 2025 | 11:44 PM

మండలంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృస్టించింది.

గాలీవాన బీభత్సం
విరిగి పడ్డ చెట్టు

నేలకొరిగిన స్తంభాలు, విరిగి పడ్డ చెట్లు

యుద్ధప్రాఽతిపదికన విద్యుత పునరుద్ధరణ

ముద్దనూరు మే15(ఆంధ్రజ్యోతి):మండలంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృస్టించింది. దీంతో గ్రామాల్లో చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మండలంలోని ముద్దనూరు, వేల్పుచర్ల, ఉప్పలూరు, మాదన్నగారిపల్లె,పెనికెలపాడు, రాజులగురువాయపల్లె, కొసినేపల్లి గ్రామాల్లో భీకరమైన గాలులతో పాటు అకాల వర్షం కురిసింది. ఉప్పలూరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో 33కేవికి సంబంధించిన 3స్తంభాలు ,11కేవి, ఎల్‌టీ లైన్‌కు సంబంధించిన 15 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.అలాగే వేప చెట్లు కూకటివేళ్లతో సహా విరిగి పడడంతో విద్యుత్‌ కు అంతరాయం ఏర్పడింది. 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. యుద్ధప్రాతిపదికన ట్రాన్స్‌కో అధికారులు పునరుద్ధరుణ చర్యలు చేపట్టారు.

Updated Date - May 15 , 2025 | 11:44 PM