Share News

టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:49 PM

జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరంలో ఉన్న టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి పరచేందుకు సంవృద్ధిగా నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్‌ చేశారు.

టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించాలి
సీపీఐ జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తదితరులు

చేనేతలకు వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోండి

సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌

జమ్మలమడుగు, మే 30 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరంలో ఉన్న టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి పరచేందుకు సంవృద్ధిగా నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్‌ చేశారు. ఈ పార్కును చేనేతలకు వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రభు త్వం కృషి చేయాలని కోరారు. శుక్రవారం జమ్మలమడుగులోని వివేకానంద జూనియర్‌ కళాశాలలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 5వ పట్టణ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలవరంలోని టెక్స్‌టైల్‌ పార్కు ఏళ్ల తరబడి నిర్మాణం కాకుండా ఉండడంతో చేనేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలో గత 14 సంవత్సరాల నుంచి ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోవడంతో భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉపాధి కోల్పోయి భూములు పరిశ్రమలకు ఇస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశతో ఉన్న రైతులకు ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మించకపోవవడం దురదృష్టకరమన్నారు. అలాగే రాజోలి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి 2.95 టీఎ సీల నీరు నిలువ పెట్టి దిగువ ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎం.ప్రసాద్‌, నాగేంద్ర రాంప్రసాద్‌, సంతోష్‌, అరవింద్‌, సాయి, మైలవరం మండల నాయకులు వెంకటరమణ, మునిరెడ్డి, క్రిష్ణ, శ్రీనివాసులు, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:49 PM