జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలి: సీపీఐ
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:22 PM
జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
రాయచోటి(కలెక్టరేట్), జూన23(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఎటువంటి పురోగతి లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాయచోటి కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టీఎల్ వెంకటేశ, ఆంధ్రప్రదేశ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి జగనబాబు, రైతు సంఘం నియోకజకవర్గ అధ్యక్షుడు హరినాథనాయుడు, అంజాబ్‌అలీఖాన, నాయకులు తదితరులు పాల్గొన్నారు.