Share News

పెరియవరం గ్రామంలో ఉచిత వైద్య సేవలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:36 PM

పుల్లంపేట మండలంలోని పెరియవరం గ్రామాన్ని రాజంపేట ఇండియన మెడికల్‌ అసోసియేషన వారు దత్తత తీసుకుని శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందించారు.

పెరియవరం గ్రామంలో ఉచిత వైద్య సేవలు
వైద్యసేవలో పాల్గొన్న ఇండియన మెడికల్‌ అసోసియేషన సభ్యులు

రాజంపేట టౌన, జూన 27 (ఆంధ్రజ్యోతి) : పుల్లంపేట మండలంలోని పెరియవరం గ్రామాన్ని రాజంపేట ఇండియన మెడికల్‌ అసోసియేషన వారు దత్తత తీసుకుని శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందించారు. అసోసియేషన అధ్యక్షుడు చలమయ్య, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.బాలరాజు, కార్యదర్శి జి.శ్రీహరి, కోశాధికారి ఎన.ధనశ్రీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించి ఉ చితంగా షుగర్‌, బీపీ వ్యాధులకు మందులను పంపిణీ చేశారు. గ్రా మంలోని ప్రతిఒక్కరికి హెల్త్‌కార్డులు అందజేశారు. ఇండియన మెడికల్‌ అసోసియేషన సభ్యులు డాక్టర్‌ చెన్నూరు సునీల్‌, జగనమోహన, అనిల్‌కుమార్‌, అరవింద్‌, లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:37 PM