జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:58 PM
రాజంపేట డివిజనలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డాక్టర్ అరవింద నేత్రాల య ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు.
రాజంపేట టౌన, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట డివిజనలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డాక్టర్ అరవింద నేత్రాల య ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ ఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య మా ట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న జర్నలిస్టులకు డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, రాజంపేట తాలుకా అధ్యక్షుడు ఇండ్లూరి చిన్నవెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివ, నందలూరు సీనియర్ పాత్రికేయులు బాలాజీ, శివశంకర్, మలిశెట్టి సుబ్బనరసింహులు తదితరులు పాల్గొన్నారు.