మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:00 AM
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ ప్రారంభించారు.
జమ్మలమడుగు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దంపతులు, కూటమి నాయకులు బస్సులో జమ్మలమడుగు-తిరుపతి ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత టిక్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆర్టీసీ డిపో మొత్తం 36 బస్సులు ఏర్పాటు చేసిందని ఇందులో 24 పల్లె వెలుగు, 12 ఎక్స్‌ప్రెస్ బస్సులను మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవీణ్, మార్కెట్‌యార్డు ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ, వంగల నాగేంద్రయాదవ్, తదితర నేతలు పాల్గొన్నారు.
స్త్రీశక్తి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు అర్బన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన స్త్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ పథకంతో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ డీఎం మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు డిపో నుంచి 76 పల్లె వెలుగు, 4 అలా్ట్రపల్లె వెలుగు, 25 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. మహిళలు ప్రయాణించే సమయంలో ఒరిజినల్ ఆధార్‌కార్డు, మొబైల్‌లో అయితే డిజిటల్ ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కొత్తపలె ్ల సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్.ముక్తియార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, వార్డు మెంబర్ సాబీర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు భేష్
మైదుకూరు రూరల్, ఆగస్ట్ 15(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం ఆర్థికం గా వెనకబడి ఉన్న సంక్షేమ పథకాలు అమలుచేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు భేష్ అని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. స్థానిక ఆర్‌టీసీ బస్‌స్టాండ్ నందు గురువారం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన స్ర్తీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ప్రయానించడానికి పల్లెవెలుగు,అల్ర్టా పల్లెవెలుగు,ఎక్స్‌ప్రెస్,సిటీ ఆర్డనరీ బస్సులలో అవకాశం కల్పిస్తు న్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ఉచిత బస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మహిళలతో బ్రహ్మంగారిమఠంకు బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర,ప్రభుత్వ ఆసుపత్రి అభివృధ్ది కమిటీ మెం బర్లు యాపరాల చిన్న,మోపూరి మెంకటరమణ, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధనపాల జగన్,మిల్లు శ్రీను, ఆర్ శ్రీనివాసులు, కటారి కృష్ణ,అన్నవరం సుధాకర్‌రెడ్డి,లక్ష్మిరెడ్డి,రమణారెడ్డి,సుబ్బారెడ్డి,పుట్టా ప్రభాకర్‌యాదవ్,బండి అమర్‌నాధ్,తుపాకుల రమణ,భూమిరెడ్డి ప్రసాద్,ఽ కౌన్సిలర్ ధనపాల భారతి,మెప్మా అధికారి కెజియా డిపో అదికారులు తదితరులు పాల్గొన్నారు.