Share News

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదు

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:41 PM

సమస్యలు పరిష్కరిం చే వరకు పోరాటం తప్పదని ఐసీయల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు స్పష్టం చేశా రు.

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదు
ఎర్రగుంట్ల ఐసీయల్‌ మెయినగేటు వద్ద ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు

మూడో రోజు ధర్నాలో ఐసీయల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

ఎర్రగుంట్ల, జూన 7 (ఆంధ్ర జ్యోతి): సమస్యలు పరిష్కరిం చే వరకు పోరాటం తప్పదని ఐసీయల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు స్పష్టం చేశా రు. న్యాయమైన సమస్యలు పరి ష్కరించాలని గత నెలరోజులుగా ఐసీయల్‌ ప్యా కింగ్‌ ప్లాంట్‌ కార్మికులు లోడింగ్‌కు వెళ్లకుండా విధులు బహిష్కరిం చారు. మూడు రోజుల నుంచి మెయిన గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. అయిన యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఎర్రగుంట్ల ఆలా్ట్రటెక్‌ (ఐసీయల్‌) కార్మాగారంలో సుమారు 50 మంది ప్యాకింగ్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఈసందర్భంగా .కార్మికులు కె.సాంబశివారెడ్డి, ఆంజనేయులు, చంద్రశేఖర్‌ నాయుడు, శేఖర్‌, శ్రీనివాసులు మాట్లాడుతూ మస్టర్‌ రూ.470 మాత్రమే ఇస్తున్నారు. దీన్ని ఇతర ఫ్యాక్టరీల్లో మాదిరిగా రూ.800లకు పెంచాలని నెలలో 26పనిదినాలు కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. విధినిర్వహణలో కార్మికులకు ప్రమాదం జరిగితే పూర్తి ఆసుపత్రి ఖర్చులు భరించాలని దుమ్ములో, వేడిలో పనిచేస్తున్నామని కనీస వసతులు కల్పించాలని కోరారు. ఇదిలా ఉండగా ఐసీయల్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 11:41 PM