లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాటం: సీఐటీయూ
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:19 AM
కార్మికుల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు ఐక్యంగా పోరాడదామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పిలుపునిచ్చారు.

రాయచోటిటౌన, జూన13(ఆంధ్రజ్యోతి): కార్మికుల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు ఐక్యంగా పోరాడదామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వారిచ్చే కమీషనలకు కక్కుర్తి పడి కా ర్మిక చట్టాలు, హక్కులు రద్దు చేసి వారిని కట్టు బానిసలుగా మా ర్చడం కోసం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు ఓబులమ్మ, ఏవీ రమణ, వెంకట్రామయ్య పాల్గొన్నారు.