ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:26 AM
జమ్మలమడుగులో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
జమ్మలమడుగు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ముందుగా ముద్దనూరు రోడ్డులోని పెట్రోలు బంకు ఎదురుగా ఎరువుల దుకాణాన్ని ఆయన తనిఖీ చేపట్టి ఎరువులు, మందులు పరిశీలించి రైతులకు ఎంత స్టాకు మందులు, ఎరువులు అమ్మారని రికార్డు తనిఖీ చేశారు. అనంతరం ఆయన ఫర్టిలైజర్స్ దుకాణ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ నరేష్‌బాబు, వారి సిబ్బంది పాల్గొన్నారు.