అధికారుల సూచనలను రైతులు పాటించాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 10:58 PM
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను రైతులు పాటించాలని రైల్వేకోడూరు వ్యవసాయ శాఖ అధికారి సందీప్ తెలిపారు.
రైల్వేకోడూరు, జూన 24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను రైతులు పాటించాలని రైల్వేకోడూరు వ్యవసాయ శాఖ అధికారి సందీప్ తెలిపారు. మంగళవారం మం డలంలోని చియ్యవరం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, జొన్న తదితర ప్రాధాన్య పంటల సాగు పద్ధతులు, సమయోచిత మందుల వాడకంపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రకృతిపరంగా లభించే ఎరువులను ఉపయోగించాలని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.