Share News

వేరుశనగ సస్యరక్షణ చర్యల్లో రైతులు

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:27 PM

ఖరీఫ్‌ వేరుశనగ పంట సాగులో చీడ పురుగులు ప్రభావం కనిపిస్తోంది.

వేరుశనగ సస్యరక్షణ చర్యల్లో రైతులు
పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతులు

సంబేపల్లె, జూలై24(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ వేరుశనగ పంట సాగులో చీడ పురుగులు ప్రభావం కనిపిస్తోంది. పంట సాగు చేసినప్పటి నుండి తెగుళ్ల పురుగుల ప్రభావం పడడంతో పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆకుల్లోని హరితాన్ని తొలచి రంధ్రాలు చేస్తుండడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారు. ఈ ఏడాది మండల వ్యాప్తంగా వర్షపాతం పరిస్థితుల కారణంగా వేరుశనగ సాగు గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. కార్తులలో వర్షాలు కురవక పంటసాగు చేపట్టలేదు. పంట సాగు చేసిన రైతులకు తెగుళ్లు, పురుగుల ప్రభావం పడింది. దీంతో ఆందోళన చెందుతున్నారు. సస్యరక్షణ చర్యలు శరణ్యం అంటూ పిచికారీ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం సస్యరక్షణ చర్యల మందులపై రాయితీల ద్వారా అందిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:28 PM