Share News

ఖరీఫ్‌ సాగులో రైతన్నలు బిజీబిజీ

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:44 PM

మండలంలో కుందూ పరివాహక ప్రాంతంలో ఖరీఫ్‌ పంటల సాగులో రైతన్నలు బిజీగా ఉన్నారు.

ఖరీఫ్‌ సాగులో రైతన్నలు బిజీబిజీ
పసుపు విత్తనం వేస్తున్న కూలీలు

రాజుపాలెం, జూన 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలో కుందూ పరివాహక ప్రాంతంలో ఖరీఫ్‌ పంటల సాగులో రైతన్నలు బిజీగా ఉన్నారు. మే నెల లో వర్షాలు పడడంతో కుందూనది పరివాహంతోపాటు బోర్ల కింద పసుపు, మొక్కజొన్న, మిరపపంటలు రైతులు జోరుగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పసుపు దిగుబడి బాగా రావడంతో క్వింటాలు ధర రూ.12వేలు పలుకుతుండడంతో ఈ పంటలపై రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతు న్నారు. అదే విధంగా మొక్కజొన్న కూడా వాతావరణం అనుకూలిస్తే మం చి దిగుబడి వస్తుందని ఆదిశగా రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈవారంలో దాదాపు వంద ఎకరాలు పంటలు సాగులోకి వచ్చే పరిసితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. మిగతా రైతులు మరింత వాన పడి కేసీ కెనాల్‌కు నీరు వస్తే ఈ పంటల సాగు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఖరీఫ్‌ పంటల సాగులో రైతన్నలకు ముం దస్తుగా సంసిద్ధమయ్యారు

Updated Date - Jun 17 , 2025 | 11:44 PM