Share News

వరి సాగులో రైతన్నలు బిజీ బిజీ

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:42 PM

జమ్మలమడుగులో రైతులు కొన్ని గ్రామాల్లో వరి సాగులో బిజీ అయ్యారు.

వరి సాగులో రైతన్నలు బిజీ బిజీ
దానవులపాడు పొలంలో వరినార్లు నాటుతున్న కూలీలు

జమ్మలమడుగు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో రైతులు కొన్ని గ్రామాల్లో వరి సాగులో బిజీ అయ్యారు. మండలంలోని దానవులపాడు, ధర్మాపురం తదితర గ్రామాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో భాగంగా రైతులు, రైతు కూలీలు పొలాల్లో వరిసాగుకు సన్నద్ధమయ్యారు. మండలంలో గత నెల రోజుల నుంచి రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయిఏ ప్రస్తుతం వర్షాలు కురవకపోయినా బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతులు వరినార్లు నాటుతున్నారు. ధర్మాపురం, దానవులపాడు, దేవగుడి, పి.సుగుమంచిపల్లి, పెద్దదండ్లూరు, అంబవరం, అనంతగిరి, గూడెం చెరువు, పూర్వపు బొమ్మేపల్లె గ్రామాల్లో వరి అధికంగా పండిస్తారు. ఇటీవల 15 రోజులుగా రైతులు వరి సాగుకోసం బిజీ అయ్యారు. మండలంలో ఇప్పటి వరకు 350 ఎకరాలకుపైగా రైతులు వరి సాగు చేశారని మొత్తం అన్ని గ్రామాలకు దాదాపు రెండు వేల ఎకరాలకు తగ్గకుండా వరి సాగు చేస్తారని రైతులు తెలిపారు. మరికొంతమంది రైతులు ఇతర పంటలపై శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ఈసారి వర్షాలు బాగా కురిస్తే సమస్య ఉండదని రైతులు తెలిపారు.

Updated Date - Jul 12 , 2025 | 11:42 PM