Share News

పత్తి సాగుపై రైతుల అనాసక్తి

ABN , Publish Date - May 06 , 2025 | 11:54 PM

పత్తి పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు.

పత్తి సాగుపై రైతుల అనాసక్తి
సాగు చేసిన పత్తి పంట

ఏటా 7వేల ఎకరాల పైనే సాగు

పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ

ఎండలు ఎక్కువ - కూలీల కొరత

తెగుళ్లు ఉన్నా.. పర్యవేక్షణ సున్నా

బి.కోడూరు, మే 6 (ఆంధ్రజ్యోతి) : పత్తి పంట సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. పత్తి పైరుకు తెగుళ్లకు మందులు, ఎరువులు, సేద్యా లు, కూలీల ఖర్చు అన్నీ పోను పైరు బాగా పండితే మిగిలేది ఎకరాకు రూ.20వేలు మాత్రమే.

బి.కోడూరు మండలంలో ప్రతి సంవత్సరం పత్తి దాదాపు 7వేల ఎకరాలు పైనే సాగు చేసేవారు. రాను రాను పెట్టుబడి ఎక్కువ కావడం, రోగాలు అధికంగా రావడం, వాటికి సరైన మందులు పిచి కారి చేసేందుకు సరైన సలహాలు అందించలేని అధికారులతో రాను రాను సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మండలం 50ఎక రాలలోపే పత్తి సాగు చేశారు. పత్తిపైరు నవంబ రు, డిసెంబరులో సాగు చేస్తే ఏప్రిల్‌, మేలో కోత లకు వస్తుంది. ఆ సమయంలో ఎండలు ఎక్కువ కావడం, కూలీలు దొరక్కపోవడం, సరైన రేటు లేకపోవడంతో రాను రాను రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపడంలేదు. దీంతో మండలంలో పత్తి సాగు పూర్గ్తిగా కనుమరుగయ్యేటట్లు ఉంది.

ఎండలు ఎండలు.. దొరకని కూలీలు

ఏప్రిల్‌, మే మాసంలో పత్తి పంట కోతకు వస్తుం ది. అయితే మంచి ఎండలు , కూలీలు దొరక్క పోవడం, కూలీలు వచ్చినా అధిక రేటు కూలీ చెబుతుండడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాలు పడి పత్తి పండిం చుకున్నా తీరా రేటు దగ్గరకు వచ్చేసరికి పెట్టుబ డి కూడా రానంతగా ఈ దళారులు చేస్తుండడం తో పూర్తిగా పత్తిని ఆపివేశారు.

తెగుళ్లు ఉన్నా .. పర్యవేక్షణ సున్నా

పత్తి పూత, పిందె దశకు వచ్చేసరికి అధికంగా తెగుళ్లు సోకడం, రైతులు తెలిసీ తెలియని మం దులు తీసుకువచ్చి పిచికారి చేయడంతో దిగుబ డులు పూర్తిగా తగ్గిపోయాయి. అధికారులు రైతు లకు సరైన సమయంలో సలహాలు అందించి వచ్చిన రోగాలకు సరైన మందులు పిచికారి చేసే విధంగా అవగాహన కల్పించడంలో విఫలమవ డంతో రైతులు పత్తిపై ఆసక్తి చూపడంలేదు.

పెట్టుబడి భరించలేక పత్తిసాగు తగ్గించారు

పత్తి పంట సాగునకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో రైతులు పంట సాగు తగ్గించారు. అలాగే కూలీల కొరత రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఇది కూడా పంట సాగు విస్తీర్ణం తగ్గడానికి మరో కారణంగా చెప్పవచ్చు.

-కౌశిక, వ్యవసాయాధికారి, బి.కోడూరు

ఏటా పది ఎకరాలు పత్తి సాగు చేసేవారం

ప్రతి సంవత్సరం పత్తి 10 నుంచి 15 ఎకరాల వరకు సాగు చేసేవారం. రాను రాను విత్తనాల ఖర్చు ఎక్కువ కావడం, రాను రాను రోగాలు అధికంగా రావడం, దిగుబడి తగ్గు తుండడంతో పత్తిని పూర్తిగా సాగు చేయకుండా మానేశాం. ప్రస్తుతం సజ్జ, మొక్కజొన్నలాంటి పంటలు వేసు కుంటున్నాం. కనీసం క్వింటా రూ.10వేలు అమ్మితే రైతుకు కాస్తో కూస్తో పెట్టుబడి పోను మిగులు తుంది. దీంతో పత్తిని పూర్తిగా మానివేశాం.

- దుగ్గిరెడ్డి. రైతు, ఐత్రంపేట

Updated Date - May 06 , 2025 | 11:54 PM