సౌమ్యనాథ స్వామి ఆలయంలో అన్నీ సమస్యలే
ABN , Publish Date - May 05 , 2025 | 11:24 PM
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సౌమ్యనాథస్వామి ఆలయంపలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆలయ మాజీ అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయ మాజీ అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్
నందలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సౌమ్యనాథస్వామి ఆలయంపలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆలయ మాజీ అధ్యక్షుడు అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మా ట్లాడుతూ ఈ ఆలయం తిరుమల- తిరుపతి దేవస్థానంలో విలీనం అయిందన్నారు. ఆలయ నిర్వహ ణ సక్రమంగా లేదని భక్తుల నుంచి ఆరోపణలు వ స్తున్నాయన్నారు. ఆలయ ఉత్తర ప్రహరీ కూలిపోతే పట్టించుకునే నాథుడు లేడన్నారు. ఆలయంలో అపరిశుభ్రత తాండవిస్తోందని, విషపురుగులు సంచరిస్తున్నాయని, దీంతో భక్తులు భయబ్రాంతులకు గు రవుతున్నారన్నారు. ఆలయంలో ఎక్కడి చెత్త అక్క డే ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందన్నారు. ప్రతి శనివారం ఉమ్మడి కడప జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తున్నారన్నారు.ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే విశ్వాసం భక్తుల్లో నెలకొందన్నారు. కానీ భక్తులకు సరైన సదుపాయాలు లేవని, స్వామివారి కోనేరులో నీరు పాచిపట్టిందన్నారు. గతంలో ప్రతి శనివారం భక్తులకు అన్న ప్రసాదాలను ఆలయ ప్రాంగణంలోనే అందజేసేవారన్నారు. కానీ నేడు ఆ విధానం లేకపోవడంతో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో, జేఈవోలు ఒక్కసారి సౌమ్యనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. కేంద్ర పురావస్తుశాఖ, తిరుమల- తిరుపతి దేవస్థానం సమన్వయంతో ఆలయ అభివృద్ధికి, అన్న ప్రసాద పంపిణీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.