యూరియా కొరత రాకుండా చూడండి : ఆర్డీవో
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:10 AM
మండలంలోని రైతులకు యూరి యా కొరత రాకుండా చూడాలని వ్యవ సాయాధికారులను జమ్మలమడుగు ఆర్డీ వో సాయిశ్రీ ఆదేశించారు.
ధర్మాపురం గ్రామంలో రైతులతో
మాట్లాడుతున్న ఆర్డీవో సాయిశ్రీ
జమ్మలమడుగు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులకు యూరి యా కొరత రాకుండా చూడాలని వ్యవ సాయాధికారులను జమ్మలమడుగు ఆర్డీ వో సాయిశ్రీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ దర్మాపురం గ్రామాన్ని సోమవా రం సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో వరిసాగు చేసిన రైతులు ఆర్డీవో మాట్లాడుతూ తమ గ్రామంలో అత్యధికంగా వరి సాగు చేసినట్లు తెలిపారు. దాదాపు 250 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని అ యితే రైతు సేవా కేంద్రాల్లో యూరియా తక్కువగా అందించారని తెలిపారు. ఒక్కొక్క రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే యూరియా ఇచ్చారని ఆర్డీవోకు తెలిపారు. ప్రస్తుతం జమ్మలమడుగు మండలంలో దాదాపు రెండు వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారని రైతులకు యూరియా కొరత ఇబ్బంది పెడుతోందని వారన్నారు. దీంతో ఆర్డీవో మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా రైతులకు అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.