Share News

ఆర్యవైశ్య సభ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:29 PM

ఆర్యవైశ్య సభ నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించారు.

ఆర్యవైశ్య సభ నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా ఎన్నికైన బుశెటి ్ట రామమోహన్‌రావు

వరుసగా 8వ సారి అధ్యక్షుడిగా ఎంపికైన బుశెట్టి రామమోహన్‌రావు

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్య సభ నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించారు. సోమవారం 24 వర్గాలకు చెందిన సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా బుశెట్టి రామమోహన్‌రావు, ఉపాధ్యక్షుడుగా జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మల్లెంకొండు ప్రతాప్‌, కోశాధికారిగా జ్వాలాది పరమేష్‌లను ఎన్నుకున్నారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా వరుసగా 8వసారి బుశెట్టి రామమోహన్‌రావు ఎన్నిక కావడం గమనార్హం. ఆయన 1994లో ఆర్యవైశ్య సభ సభ్యునిగా ఎన్నిక కాగా 2001లో ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుశెట్టి రామమోహన్‌రావు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నుంచి అమ్మవారికి బంగారు రథం, బంగారు చీరె, వజ్రపు చీరె, వజ్రపు కిరీటం, వజ్ర, బంగారు ఆభరణాలు అమ్మవారికి చేయించారు. అలాగే ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ఉచిత హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆర్యవైశ్యులకు వైద్యసేవలు అందించారు. 50 మంది పేద ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య సభ ద్వారా ఇళ్లపట్టాలను ఉచితంగా అందజేశారు. అలాగే ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో జిమ్‌, వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఉద్యానవనం, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సభ పూచీకత్తుతో ఆర్యవైశ్యులకు ఆప్కాబ్‌ ద్వారా వంద మంది ఆర్యవైశ్యులకు రూ.2 కోట్లు రుణాలు మంజూరు చేయించారు. ఆర్యవైశ్య సభ నూతన కార్యవర్గాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 30 , 2025 | 11:30 PM