Share News

రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:10 PM

సిద్దవటంలో వెలసిన రంగనాథ ఆలయ అభివృద్ధికి కృషి చే స్తానని ఎండోమెంట్‌ ఇనచార్జి ఈవో శ్రీధర్‌ తెలిపారు.

రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి
రంగనాథ ఆలయ ఆవరణాన్ని శుభ్రం చేస్తున్న కూలీలు

ఎండోమెంట్‌ ఇనచార్జి ఏవో మోహనరెడ్డి

సిద్దవటం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సిద్దవటంలో వెలసిన రంగనాథ ఆలయ అభివృద్ధికి కృషి చే స్తానని ఎండోమెంట్‌ ఇనచార్జి ఈవో శ్రీధర్‌ తెలిపారు. శు క్రవారం ఆయన ఆ లయ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను కూలీలతో తొలగించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో మంజూరైన నిధులు రూ.34 లక్షలు పనులు చేపట్టక టీటీడీకి వెనక్కు వెళ్లిపోయాయన్నారు. తిరుపతికి వెళ్లి నిధులు మంజూరు చేయించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎండోమెంట్‌ సిబ్బంది చంద్ర, కూన, విజయభాస్కర్‌, కూలీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:10 PM