ఉన్నత స్థాయికి చేరుకునేందుకు విద్యే మార్గం
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:42 PM
ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గమని ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు అన్నారు.
చిట్వేలి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య ఒక్కటే మార్గమని ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు అన్నారు. బడిబయట పిల్లల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం సీఆర్పీ చంద్రశేఖర్ రాజుకుంట పంచాయతీ ఎస్టీ కాలనీలో పాఠశాల బయట ఉన్న 12 మంది విద్యార్థులను గుర్తించి చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒక్కటే తోడ్పడుతుందన్నారు. ఆగస్టు నెల నుంచి మూడు కిలోమీటర్లు పైబడి దూరం నుంచి వచ్చే విద్యార్థులకు నెలకు రూ.600 ప్రభుత్వ రవాణా భత్యంగా చెల్లిస్తుందన్నారు. చదువుకునే వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ పనికిపోకుండా బడికి రావాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన, విద్యార్థి మిత్ర కిట్‌లను విద్యార్థులకు అందించారు.ఒకేషనల్ ఉపాధ్యాయుడు దొండ్లవాగు శ్రీనివాసులు, రాజశేఖర్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.