వైద్యులు రాక.. రోగుల పాట్లు
ABN , Publish Date - May 03 , 2025 | 11:09 PM
జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందు బాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు.
జమ్మలమడుగు, మే 3 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందు బాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య చికిత్సల కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే అక్కడ డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టడంతో చేసేది లేక రోగులు వెనుదిరిగి పోవాల్సి వచ్చింది. జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి శనివారం ఉదయం 9.30 గంటలకు జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం సమీప గ్రామాల రోగులు వచ్చారు. అయి తే ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు ఎవ్వరూ విధులకు హాజరుకాలేదని కొందరు రోగులు అసహనం వ్యక్తం చేశారు. అసలు ఓపీ విభాగం డాక్టర్లు లేకపోవడంతో వారి గది తలుపులు మూసే ఉండడంతో రోగులు వారి సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక కొంద రు వెనుదిరిగి వెళ్లక మరి కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైద్యాధికారులకు సూచిస్తున్నా ఎందుకు వారు స్పందించ డంలే దంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరి నుంచి ముగ్గురు డాక ్టర్లు మాత్రమే రోగులను పరీక్షించినట్లు రోగులు తెలిపారు. డాక్టర్లు సొంత క్లీనిక్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయమై జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రఫిక్‌పాషాను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కడపలో మీటింగ్ ఉండడం వల్లతాను వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో 15 మంది డాక్టర్లలో పది మంది ఉన్నారని కొందరు డాక్టర్లు సెలవుపై వెళ్లారని తెలిపారు.