ప్రిస్కిప్షన లేకుండా మందులు విక్రయించవద్దు
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:58 PM
మందుల షాపులలో వై ద్యుల ప్రిస్కిప్షన లేనిదే మందుల ను అమ్మరాదని బద్వేలు అర్బన సీఐ రాజగోపాల్, ఎస్‌ఐ రవికుమా ర్‌లు పేర్కొన్నారు.

బద్వేలుటౌన, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి): మందుల షాపులలో వై ద్యుల ప్రిస్కిప్షన లేనిదే మందుల ను అమ్మరాదని బద్వేలు అర్బన సీఐ రాజగోపాల్, ఎస్‌ఐ రవికుమా ర్‌లు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని అర్బన పోలీస్‌స్టేషన ఆవరణలో ఉన్నతాదికారుల సూచనల మేరకు మెడికల్ షాపువారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బనసీఐ రాజగోపాల్ మాట్లా డుతూ యువత డ్రగ్స్‌కు బానిసై పెడదారిన పడుతున్నారని, అలాంటి వారు కొందరు మెడికల్ షాపుకు వచ్చి మత్తును ఇచ్చే కొన్ని మందులను అడిగితే డాక్టర్ల ప్రిస్కిప్షన లేనిదే ఎలాంటి మందులు అమ్మరా దన్నారు. ఈ సమావేశంలో మెడికల్‌షాపు అధ్యక్షుడు సముద్రాల రాధాక్రిష్ణ, ఉపాధ్య క్షుడు చలమల వెంకటసుబ్బరెడ్డి, సెక్రటరి దర్శి సుబ్బరాజ, ట్రజరర్ సుధా కర్ తదితరులు పాల్గొన్నారు.