Share News

మైదుకూరు ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్‌ సెంటర్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:55 PM

మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వర లో డయాలసిస్‌ సెంటర్‌తో పాటు మార్చురీ, పోస్టుమార్టం, పోలీసు ఔట్‌పో స్టు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ వెల్లడించారు.

మైదుకూరు ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్‌ సెంటర్‌
ఎక్స్‌రే మిషన ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌

ఎక్స్‌రే సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పుట్టా

మైదుకూరు సెప్టెంబరు30(ఆంద్రజ్యోతి): మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వర లో డయాలసిస్‌ సెంటర్‌తో పాటు మార్చురీ, పోస్టుమార్టం, పోలీసు ఔట్‌పో స్టు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ వెల్లడించారు. మంగళవారం ఆసుపత్రిలో ఎక్స్‌రే సెంట ర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 50 పడ కల నుంచి 100 పడకల ఆసుపత్రిగా రూ పొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. డీఎంఎఫ్‌ నిధుల నుంచి మంజూరైన రూ.20 లక్షలతో ఎక్స్‌రే మిషన తోపాటు అవసరమైన సాంకే తిక పరికరాలు తెచ్చామన్నారు. ఇంకా ఆర్‌ఓ ప్లాంటు, జనరేటర్‌, ఆక్సిజన సెంటర్‌ మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన ఏపీ రవీంద్ర, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనపాల జగన, లక్ష్మీనారాయణ, బండి అమర్‌, తుపాకుల రమణ, డాక్టర్‌ జోష్న, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:55 PM