ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం తోడ్పడండి
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:04 AM
ప్రొద్దుటూ రు అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరా జులరెడ్డి ముగ్గురు రాష్ట్ర మంత్రులను కలిసి విన్న వించారు.
ముగ్గురు మంత్రులను కలిసిన ఎమ్మెల్యేవరదరాజులరెడ్డి
ప్రొద్దుటూరు ,జూన 24 (ఆంధ్రజ్యోతి) : ప్రొద్దుటూ రు అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరా జులరెడ్డి ముగ్గురు రాష్ట్ర మంత్రులను కలిసి విన్న వించారు. మంగళవారం రాజధాని అమరావతిలో రెవె న్యూ స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రష న శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి జనార్ధన రెడ్డి, విద్యుత శాఖ మంత్రి గట్టిపాటి రవికుమార్ లను కలిసి చర్చించారు. ఇందులో ప్రధానంగా పట్టణం లోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు కొర్రపాడు రోడ్డ్డు విస్తరణ కొరకు రూ.22 కోట్ల నిధుల విడుదలకోసం విన్నవించారు. అలాగే వైసీపీ హయాంలో జరిగి ప్రభు త్వ భూముల ఆక్రమణలు సబ్ రిజిషా్ట్రర్ కార్యాలయంలో జరిగిన అక్రమా లను వెలికితీయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. ప్రొద్దుటూ రు పట్టణంలో విద్యుత సరఫరా చేయడానికి తగినన్ని సబ్‌స్టేషన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొత్తసబ్ స్టేషన్ల నిర్మాణానికి సహకరించాలని విద్యుత మంత్రి రవికుమార్‌ను కోరారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం పై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వరద రాజులరెడ్డి తెలిపారు.