Share News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:24 PM

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులను తినడం ద్వారా సం పూర్ణ ఆరోగ్యం సాధ్యమని డాక్టర్లు వినోద్‌కుమార్‌, దివ్యశ్రీ తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను పరిశీలిస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వెంకటమోహన

రామాపురం, జూన18 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులను తినడం ద్వారా సం పూర్ణ ఆరోగ్యం సాధ్యమని డాక్టర్లు వినోద్‌కుమార్‌, దివ్యశ్రీ తెలిపారు. బుధవా రం రామాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు, అకుకూరలు, దుంపజాతి, ఇతర పండ్ల రకాలతో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఏ పవన, మార్కెటింగ్‌ మాస్టర్‌ ట్రైనర్‌ రవీంద్రగౌ డ్‌, రామాపురం మండలం మాస్టర్‌ ట్రైనర్‌ మధుకర్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతి ద్వారా పండించిన ఉత్పత్తుల ద్వారా మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి వెంకటమోహన, మోడల్‌ మేకర్‌ సదాశివరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుధాకర్‌, హరి, ఆర్యో పర్యవేక్షకులు, ఏఎనయంలు ఇంకా ఐసీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:24 PM