Share News

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఆర్డీవో

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:12 PM

ప్రతి ఒక్కరు యోగా చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమ వుతాయని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సూచించారు.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఆర్డీవో
జమ్మలమడుగులో యోగా చేస్తున్న ఆర్డీవో సాయిశ్రీ, కమిషనర్‌, సిబ్బంది

జమ్మలమడుగు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు యోగా చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమ వుతాయని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సూచించారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ముద్దనూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్డీవో సాయిశ్రీ హజరై సూచనలు ఇచ్చారు. తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

బద్వేలుటౌనలో:యోగాతోనే సంపూ ర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ము న్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిఽ దిలోని పోరుమామిళ్లరోడ్డు ప్రధాన రహదారిపై యోగా గురువు అమర్‌నా థ్‌రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమా లను నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాల ద్వారా మనకు ఎలాంటి ప్రయో జనాలు చేకూరుతాయి, సూర్యనమస్కారాలు, ప్రణాయామాలు తదితర యోగాస నాలను ప్రజలతో చేయించారు. ప్రతి ఒక్కరూ రోజూ యోగాచేసి ఆరోగ్యంగా ఉండాలని కమిషనర్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:12 PM