Share News

వచ్చాడయ్యో .. సామీ

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:55 PM

చవి తి వేడుకల కోసం గణనాథులు మండపాలకు చేరుకోవడంతో బుధవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులతోపాటు నిర్వా హక కమిటీవారు ప్రత్యేక పూజలే చేశారు.

వచ్చాడయ్యో .. సామీ
జమ్మలమడుగులో వినాయకుడికి పూజలు చేస్తున్న భూపేశ్‌రెడ్డి, ఆర్టీసీ కార్మికులు

వైభవంగా ప్రారంభమైన గణేశ ఉత్సవాలు

వాడవాడలా విగ్రహాలను ప్రతిష్ఠించి

పూజలు చేసిన భక్తులు, ఉత్సవ కమిటీలు

ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జనానికి

తరలివెళ్లిన గణనాఽథులు

ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా

పోలీసు యంత్రాంగం పటిష్టచర్యలు

జమ్మలమడుగు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):చవి తి వేడుకల కోసం గణనాథులు మండపాలకు చేరుకోవడంతో బుధవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులతోపాటు నిర్వా హక కమిటీవారు ప్రత్యేక పూజలే చేశారు. ఇందులో భాగంగా జమ్మలమడుగులో దాదాపు 200 వినాయక విగ్రహాలు కొలువైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో కన్నెలూరు, నాగులకట్టవీధి, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో పెద్ద వినాయక విగ్రహాలను మండపాల వద్ద కొలువుదీర్చారు. 27వ తేదీ ప్రారంభమైన వినాయక చవితి పండుగ శుక్రవారం నాటికి దాదాపు 60 విగ్రహాలు నిమజ్జనానికి తరలించేందుకు పోలీసులకు ఉత్సవ కమిటీవారు తెలియజేశారు. అందులో భాగంగా గురువారం ఉదయం టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండు డిపో వద్ద స్వర్ణ వినాయకునికి పూజలు చేసి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో కార్మికులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జమ్మలమడుగు మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, వారి సిబ్బందిమట్టి వినాయక విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు.

గణపతి బప్పా మోరియా..

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పర్వదినం సందర్భంగా పట్టణంలో వీధి వీధినా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణనాథులను కొలువుదీర్చి పూజలు నిర్వహిస్తున్నారు. శివాలయంలో ఆపరేషన్‌ సింధూర్‌ పంచముఖ విజయగణపతి మట్టితో చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి చేతిలో జాతీయ జెండాను ఏర్పాటు చేసిన దేశభక్తిని చాటుకుంటున్నారు. అలాగే విద్యార్థులకు క్విజ్‌ పోటీలు, తులాభారం నిర్వహిస్తున్నారు. మిట్టమడి వీధిలో యువతరంగం, వినాయక ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఏకోఫ్ర్లెండ్లీ గణనాథున్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. మోడంపల్లె పెద్దమ్మ గుడివద్ద పేపర్‌ గుజ్జుతో తయారు చేసిన గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు. కొర్రపాడు రోడ్డులో కాటన్‌ మర్చంట్స్‌, ఆయిల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అశ్వవాహన గణపతిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయిరాజేశ్వరి కాలనీలో నిల్చున్న భారీ గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పార్వతీపుత్రున్ని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి 3, 5, 7, 9 రోజులపాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు.

ఎర్రగుంట్లలో:వినాయక చవితి సందర్భంగా ఎర్రగుంట్లలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహా లకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మండలంలో సుమారు 200విగ్రహాలకు పైగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాయం త్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నడివూరులో బారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఏరువాగగంగమ్మ ఆలయం వద్ద భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిన్నారులు నృత్యా లు, పాటలు అలరించాయి.

కొండాపురంలో: మండలంలో వినాయకచవితి పండుగను వైభవంగా జరుపుకున్నారు. మండ లంలో సుమారు 110 విగ్రహాలను ఏర్పాటుచే శారు. కొండాపురం పట్టణంలోని మెయినరోడ్డు లో సుమారు 23 అడుగులు పెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. బుధ, గురువారాల్లో వినాయక మండపాల వద్ద పలుచోట్ల భజన, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం, ఆది వారం గండికోట బ్యాక్‌వాటర్‌లో వినాయక విగ్ర హాలను నిమజ్జనం చేయనున్నారు.

ముద్దనూరులో:మండలంలో వినాయక చవితి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. వీధి వీధిన గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేసి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం పాత మోరీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు.

పోరుమామిళ్లలో : వినాయకచవితి పండుగ సందర్భంగా పోరుమామిళ్ల మండలంలోని 17 పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లో గణనాధుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గురువారం భక్తిశ్రద్దలతో పూ జలు చేశారు. యువకులు ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కాశినాయనలో:మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు సాంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా వెలసిన మండపాలల్లో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యే క పూజలు నిర్వహించారు.వినాయనక చవితి ఉత్సవాలతో గ్రామాల్లో సందడి నెలకొంది.

రాజుపాలెంలో: వాడవాడలా గణనాఽథుడు కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలం కరణలో మండపాలు ఏర్పాటు చేసి వినా యకవిగ్రహాలు ఏర్పాటు చేశారు. మండల వ్య్తాప్తంగా దాదాపు 80 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

్ఞ్డఅట్లూరులో : మండలంలోని 72 మండపా లను ఏర్పాటు చేసి గణనాఽథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వినాయ కుని మండపాల వద్ద అన్నదానాలు ప్రసాదాలు పంపిణీ చేశారు. మండలంలో ఏ ర్పాటు చేసిన వినాయక మండపాలను అట్లూ రు ఎస్‌ఐ రామక్రిష్ణ సిబ్బందితో పర్యవేక్షించారు.

దువ్వూరులో: మండలంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దువ్వూరుతోపాటు పలు గ్రామాల్లో వినాయకుని విగ్రహాలు బుధవారం నెలకొల్పి పూజలు నిర్వహించారు. గణపతి పప్పా మోరియా అంటూ గురువారం భక్తులు విగ్రహాల ముందు సందడి చేశారు. ప్రధానంగా యువత డ్రమ్ములు వాయిస్తూ నృత్యాలు చేశారు. పలు చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాలను పోలీసులు పర్యవేక్షించారు.

బ్రహ్మంగారిమఠంలో : మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఎదురుగా అభయ విఘ్నేశ్వరస్వామి వారిని కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను చేపట్టారు. గురు వారం అన్నదాన కార్యక్రమాలు చేశారు. కొత్తూ రులో 23 అడుగులు ఎత్తు గల విఘ్నే శ్వర స్వామిని నిలబెట్టారు. కార్యక్రమంలో ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చాపాడులో: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు బుధవారం వినాయక చవితి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కొన్ని గ్రామాల వారు గురువారం కుందూ నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు జరుగకుండా నది వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.

చవితి వేడుకలలో ముగ్గుల పోటీలు

బద్వేలు, ఆగస్టు 28, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ని శివానగర్‌లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇం దులో భాగంగా పలువురు మహిళలుఈ పోటీల లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడం నరసిం హులు వారి కుమారుడు మేడం హరిబాబు, యనమల శ్రీధర్‌లు విజేతలకు బహుమతులు అందించారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మైదుకూరు రూరల్‌లో : మైదుకూరు పట ణంలో బద్వేల్‌ రోడ్డులోని కొంత మంది యువ కులు అమలాపురం నుంచి మట్టి గణేశ విగ్రహాన్ని తెప్పించారు. ఇంత పెద్ద గణేశ విగ్ర హం మైదుకూరులోనే ఇదే మొదటిసారిగా నిల పడం అని పలువురి ప్రశంసలు అందిం చారు. మైదుకూరు పాతూరులోని పెద్దమ్మ గుడి వద్ద గణేశ విగ్రహం వద్ద బుధవారం రాత్రి లడ్డూ వేలం పాటలో శీలం మిద్దెవాళ్ల పవన్‌ రూ.2,60,000లకు దక్కించుకొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:55 PM