Share News

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:09 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వి ఫలమైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంతరెడ్డి అ న్నారు.

హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న శ్రీకాంతరెడ్డి

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంతరెడ్డి

రాయచోటిటౌన, జూలై19(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వి ఫలమైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంతరెడ్డి అ న్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో రా యచోటి మండల వైసీపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభ వ, 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీలను అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశకుమార్‌రెడ్డి, జిల్లా పరిషత మాజీ చైర్మన సుగవాసి బాలసుబ్రమణ్యం, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేశ, ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:09 PM