Share News

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం ధ్యేయం

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:19 AM

పేద,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు ధ్యేయమని జమ్మల మడుగు టీడీపీ ఇనచార్జి భూపేశ రెడ్డి తెలిపారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం ధ్యేయం
రైతుకు సబ్సిడీ డ్రోనను అందజేస్తున్న భూపేశరెడ్డి

కొండాపురం, జూలై 22 (ఆంధ్రజ్యో తి): పేద,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు ధ్యేయమని జమ్మల మడుగు టీడీపీ ఇనచార్జి భూపేశ రెడ్డి తెలిపారు. మండలంలోని ము చ్చుమర్రి, పి.అనంతపురం, రామి రెడ్డిపల్లె, బురుజుపల్లె, యనమలచిం తల గ్రామాలలో మంగళవారం నిర్వ హించిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం రాషీ్ట్రయ కృషి యో జన పథకంలో భాగంగా ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో అందజేసే డ్రోనను భూపేశరెడ్డి బి.కొట్టాలపల్లెకు చెందని రైతు మహేశ్వరరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మండల కూటమి ఇనచార్జ్జి శివనారాయణరెడ్డి, ఏవో ఏవీ రామాంజులరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి నాయకులు రామసుబ్బారెడ్డి, చామల రామిరెడ్డి, పద్మజ, అరుణ్‌కుమార్‌రెడ్డి, అంకిరెడ్డి, రమేష్‌రెడ్డి, గోరిశెట్టిబాబు పాల్గొన్నారు.

అట్లూరులో: అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన మంచూరి సూర్యనారాయణరెడ్డి మండల టీడీపీ అధ్యక్షుడు పాపుదిప్పు మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్న లబ్ధిదారులు వారి అబిప్రాయాలను వారికి తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకు లు అరవ శ్రీనివాసులురెడ్డి, పోతిరెడ్డి రెడ్డయ్య, పాటూరు రాధాక్రిష్ణారెడ్డి, చిలిపి క్రిష్ణారెడ్డి, పెద్దరామ సుబ్బారెడ్డి, చిన్నరామసుబ్బారెడ్డి , జయక్రిష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నరసింహారెడ్డి, నరసారెడ్డి, గంగిరెడ్డి, శ్రీకాంతరెడ్డి, గురుప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మైదుకూరు రూరల్‌లో :రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబుతో నియోజకవర్గ అభివృద్ధి పుట్టా సుధాకర్‌యాదవ్‌తోనే సాధ్యమని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్‌ యాపరాల చిన్న అన్నారు. స్థానిక ప్రొద్దుటూరులో రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఇంటింటికి తిరగి సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈకార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జ్‌ తుపాకుల రమణ,బూత్‌ ఇన్‌చార్జ్‌ దాసరి సత్య, శివసారథి, గణేష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:19 AM