మున్నెల్లి రాజుపాలెంలో పరిశుభ్రతకు చర్యలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:55 PM
మండల పరిధిలోని మున్నెల్లి రాజు పాలెం గ్రామం లోవైద్యాఽ దికారి వినీతకుమార్‌రా జు ఆధ్వర్యంల్వో వైద్యసి బ్బంది గ్రామంలో పర్య టించి పరిశుభ్రతపై చర్య లు చేపట్టారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన గ్రామంలో వైద్యసిబ్బంది పర్యటన ప్రజలకు అవగాహన
బి.కోడూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని మున్నెల్లి రాజు పాలెం గ్రామం లోవైద్యాఽ దికారి వినీతకుమార్‌రా జు ఆధ్వర్యంల్వో వైద్యసి బ్బంది గ్రామంలో పర్య టించి పరిశుభ్రతపై చర్య లు చేపట్టారు. ప్రజలకు దోమలు వ్యాప్తి వల్ల విష జ్వరాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘మురుగులో మున్నెల్లి రాజుపాలెం’ అనే కథనం వెలువడింది. దీనిపై స్పందించిన వైద్యాధికారులు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. స్థానిక సర్పంచ గురయ్య తన సిబ్బందితో వీధివీధినా బ్లీచింగ్ పౌడరు చల్లించారు. అబేట్ ద్రావణం మురుగునీటిలో పిచికారి చేయడం, గ్రామస్థులకు వివిధ రకాల వ్యా ధుల పట్ల అవగాహన కల్పించారు. అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని సూచించారు. అయితే గ్రామంలో అధికారులు మురుగునీరు తొలగించే ప్రయ త్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ప్రజలు వైద్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూసర్‌వైజరు జానవిలియం, ఎంఎల్‌హెచపీ రాజేశ్వరి, ఏఎనఎం కుమారి, ఆశా కార్యకర్తలు, గ్రీన అంబాసిడర్లు పాల్గొన్నారు.