కార్మికవర్గ ప్రయోజనాలే సీఐటీయూ లక్ష్యం
ABN , Publish Date - May 31 , 2025 | 12:12 AM
కార్మికవర్గ ప్రయోజనాలే సీఐటీయూ లక్ష్య మని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. వెంకటేశ్వర్లు పేర్కొ న్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
రాయచోటిటౌన, మే30(ఆంధ్రజ్యోతి): కార్మికవర్గ ప్రయోజనాలే సీఐటీయూ లక్ష్య మని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. వెంకటేశ్వర్లు పేర్కొ న్నారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాయచోటి బస్టాండు సమీపంలో సీఐటీయూ జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు డీ.వెంకట్రామయ్య ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1970 మే 30వ తేదీన కలకత్తాలో సీఐటీయూ ఆవిర్భవించినట్లు మహాసభలు నిర్వహించి ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహిస్తోందన్నారు. అన్ని కార్మిక సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోందని తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏవీ రమణ, రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మణి, మున్సిపల్ కార్మిక నేతలు చెన్నయ్య సిద్దయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.