ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:11 PM
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ అన్నారు.
నందలూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రవాసి పూల సురే్‌షకుమార్ మెదడు సంబంధిత వ్యాధి కారణంగా వేలూరు సీఎంసీ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని వైద్య ఖర్చులకు ప్రభుత్వ సా యం అందిం చాలని కోరారన్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరికి సురేష్ విషయం తెలపతడంతో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరగా బాధితుడు సురే్‌షకు రూ.4,61,770 మంజూరు చేశా రన్నారు. ఆ చెక్కును బాధితుడి ఇంటివద్దకు వెళ్లి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగె రాంప్రసాద్, రాష్ట్ర మైనార్టీ మోర్చ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, బీజేపీ మండల కార్యకర్తలు, నాయకులు రాచూరి మురళి, జయకుమార్‌రెడ్డి, మహేష్, హెచడీ ప్రసాద్, మండెం నాగేంద్ర, గంగాధర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.