Share News

ఎరువుల దుకాణాలు తనిఖీ

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:57 PM

మండల కేంద్రమైన చాపాడులోని ఎరువుల దుకాణాలను మైదుకూరు ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో పద్మలత మంగళవారం తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణాలు తనిఖీ
రికార్డులు పరిశీలిస్తున్న ఏడీఏ క్రిష్ణమూర్తి

చాపాడు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన చాపాడులోని ఎరువుల దుకాణాలను మైదుకూరు ఏడీఏ క్రిష్ణమూర్తి, ఏవో పద్మలత మంగళవారం తనిఖీ చేశారు. దుకాణాల్లోని రికార్డులను క్రిష్ణమూర్తి పరిశీలించారు. డీలర్లు రసాయనిక ఎరువులను రైతులకు ఎక్కువ రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు అవసరం ఉన్నన్ని రసాయనిక ఎరువుల బస్తాలు అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. రైతులు యూరియాను వరిపైరు సాగుకు ఎక్కువగా ఉపయోగించవద్దని అవసరాన్ని బట్టి పైరు పెరుగుదలకు రైతులు రసాయనిక ఎరువులను పలు దపాలుగా ఉపయోగించాలన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:57 PM