విద్యుత లైన మార్పు..కొత్త స్తంభం ఏర్పాటు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:46 PM
మండల పరిధిలోని కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత వైర్లును విద్యుత శాఖ అధికారులు మంగళవారం ఉదయం కొత్త స్తంభం ఏర్పాటు చేసి మార్చి వేశారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ఖాజీపేట, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత వైర్లును విద్యుత శాఖ అధికారులు మంగళవారం ఉదయం కొత్త స్తంభం ఏర్పాటు చేసి మార్చి వేశారు. ఈ విషయమై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘విద్యుత వైర్లు ఇలా.. నాణ్యత ఎలా..?’ అన్న కథనం ప్రచురితం కావడంతో ఖాజీపేట ఇన్‌చార్జి ఏఈ నాగరాజు స్పందించి కొత్త స్తంభం ఏర్పాటు చేసి అతుకులు లేని వైర్లు ఏర్పాటు చేయించారు. ఇలా చేయడం వల్ల బ్రేక్‌డౌన్ రాదని రైతులు, ప్రజలు పేర్కొంటూ ‘ఆంధజ్యోతి’కి ధన్యవాదాలు తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తే రైతులకు నాణ్యమైన విద్యుత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.