హామీల అమలు ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:03 AM
ఎన్నికల హామీలను అమలుచేసి నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకే దక్కుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి లు తెలి పారు.
ప్రొద్దుటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల హామీలను అమలుచేసి నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకే దక్కుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి లు తెలి పారు. సోమవారం స్ధానిక 39 వవార్డులోని హనుమాన నగర్ జంగం పేట ప్రాంతాలలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంను టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టాయి. ఈసం దర్బంగా వారు మాట్లాడుతూ జగన నవరత్నా లు పేరిట రాష్ట్ర ప్రజలను వంచించాడన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి అని చెప్పి కేవలం ఒక్కరికే అందజేసి మో సం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం లో తల్లికి వందనం ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందజేశామన్నా రు. 4వేల ఫించనును ఒకే సారి పెంచారన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇనచార్జి చెంగా సిద్దయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవీ సుధా కర్‌రెడ్డి, టౌనబ్యాంకు చైర్మన సుబ్బారెడ్డి, వాల్మీకి బోయ కార్పొరేషన డైరెక్టర్ నల్లబోతుల నాగ రాజు, టీడీపీ పట్టణ మాజీ అద్యక్షుడు ఘంట శాల వెంకటేశ్వర్లు, కౌన్సిల్లర్ మురళీధర్‌రెడ్డి కుతుబుద్దీన సర్పంచ శివచంద్రారెడ్డి మాడెం సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
కూటమితో ఇంటింటికీ సుపరిపాలన
అట్లూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వంలో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడంతో ప్రభుత్వం ఇంటింటికీ సుపరిపాలన అందిస్తున్నదని డీసీసీ బ్యాంకు ఛైర్మన మం చూరి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. సోమవా రం వలసపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పింఛ న్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు చేసి న పథకాలతో మహిళలు ఎక్కువగా లబ్ధి పొం దారన్నారు. అలాగే గ్రామస్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అట్లూరు మండల టీడీపీ నాయకులు పోతిరెడ్డి రెడ్డయ్య, మన్యం వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామ సుబ్బారెడ్డి, రామక్రిష్ణరెడ్డి, గురుప్రసాద్‌రెడ్డి తది తర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.