శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:04 AM
ప్రతి ఒక్కరు శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - డీఎస్పీ
ఖాజీపేట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఖాజీపేట పోలీసు స్టేషన్‌లో గ్రామాల్లోని కమిటీ సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే విగ్రహాల వద్ద శాంతియుతంగా పూజలు చేసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా డీజేలు, డ్యాన్సులు ఏర్పాటు చేస్తే చర ్యలు తప్పవన్నారు. నిమజ్జనం రోజు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకే గ్రామంలో రెండు ప్రతిమలు ఏర్పాటుచేస్తే ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం నిమజ్జనం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కడైనా రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిస్తే ప్రజలు సహకరించి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మోహన్, సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.