Share News

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:47 PM

వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరుగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ తెలిపారు.

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున ్న ఆర్డీవో సాయిశ్రీ

పీస్‌ కమిటీ సమావేశంలో ఆర్డీవో సాయిశ్రీ

జమ్మలమడుగు, ఆగస్ట్టు 21 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరుగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ తెలిపారు. గురువారం జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు ఆర్డీవో కార్యాలయ సబాభవనంలో వినాయక చవితి పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిశ్రీ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ వినాయక చవితి పండుగ రోజు నుంచి 3 నుంచి అయిదు రోజులపాటు విగ్రహాలను వినాయక ఉత్సవ కమిటీవారు కొలువు తీర్చడానికి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మాట్లాడుతూ జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తదితర పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు కొలువు చేసే చోట ఆర్గనైజింగ్‌ కమిటీవారు అనుమతి పొందాలన్నారు. ఎవరైతే విగ్రహాన్ని కొలువు చేస్తున్నారో అలాంటివారు ముందస్తుగా ఒక యాప్‌ ఉంటుందని, ఆ యాప్‌ను అప్‌లోడ్‌ చేయడం వలన అక్కడే అనుమతి వస్తుందన్నారు. ్ఙ. అనంతరం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డీజేకి అనుమతి లేదని అలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్‌ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్లు, ప్రొద్దుటూరు రవిచంద్రారెడ్డి, జమ్మలమడుగు వెంకటరామిరెడ్డి, తహసీల్దార్లు గురప్ప, గంగయ్య, శ్రీనివాసరెడ్డి, శోభన్‌బాబు, నరసింహ, సీఐలు, ఎస్‌ఐలు, ముస్లింలు, సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ఎర్రగుంట్ల, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకు లు ప్రభుత్వ నిబందనలు తప్పకుండా పాటిం చాలని లేకుంటే చర్యలు తప్పవని సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ నాగముర ళిలు పేర్కొన్నారు. ఎర్రగుంట్ల అర్భన పోలీసుస్టేషన పరిధిలోని వినా యక విగ్రహాల నిర్వాహకులతో గురువారం సమావేశంలో వారు మా ట్లాడుతూ ఎలాంటి మత ఘర్షణలకు పాల్పడకూడదన్నారు. అలాగే సూచించిన చోటే నిమజ్జనం చేయాలన్నారు.

మైలవరంలో: గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసు, విద్యుత, తదితర శాఖల ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మైలవరం ఎస్‌ఐ రామసుందర్‌రెడ్డి గురువారం తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమ వివరాలను పోలీసు స్టేషన్‌లో తెలియజేయాలని తెలిపారు. మండపాల కమిటీ సభ్యులు, ప్రజలు పండుగను శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు.

కలసపాడులో: వినాయక చవితి పడుగ సందర్భంగా మండపాలు వినాయక విగ్రహా లను నిలుపుటకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ తిమోతి తెలి పారు. పండుగ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు విగ్రహాలు ఏర్పాటుచేస్తున్న గ్రా మాల వారితో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:47 PM