Share News

బై..బై.. గణేశా

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:07 AM

వినా యక చవితి వేడుకలకు కొలువుదీరి భక్తిశ్రద్ధల తో మూడు రోజులపాటు పూజలందుకున్న గణ నాథులు శుక్రవారం భక్తుల కేరింతల నడుమ గంగ ఒడి చేరుకున్నారు.

బై..బై.. గణేశా
అట్లూరు వేమలూరు వంతెనపై నిమజ్జనం పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐ రామక్రిష్ణ, సిబ్బంది

జమ్మలమడుగు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): వినా యక చవితి వేడుకలకు కొలువుదీరి భక్తిశ్రద్ధల తో మూడు రోజులపాటు పూజలందుకున్న గణ నాథులు శుక్రవారం భక్తుల కేరింతల నడుమ గంగ ఒడి చేరుకున్నారు. జమ్మలమడుగులో ఉత్సవ కమిటీలవారు అంగరంగ వైభవంగా రంగులు చల్లుకుంటూ నిమజ్జనానికి విగ్రహాలను తరలించారు. మరికొందరు వినాయక విగ్రహాల వెంట మేళాలతో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్బన్‌ సీఐ నరేష్‌బాబు, వారి సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ప్రొద్దుటూరు టౌన్‌లో: వినాయక చవితి పండుగను పురష్కరించుకుని వీధి వీధిన కొలువుతీరిన గణనాథులు భక్తులతో పూజలు అందుకుంటున్నారు. కొన్ని వినాయకవిగ్రహాల వద్ద మధ్యాహ్న సమయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మరికొన్ని వినాయక విగ్రహాల వద్ద చిన్నారులకు క్విజ్‌ పోటీలు, భక్తిగీతాలపోటీలు, మహిళలకు ముగ్గులు, కోలాటం పోటీలు నిర్వహించారు. స్థానిక శ్రీరాములపేట ఏసీఎన్‌ కార్యాలయం వెనుకవైపు చాకెట్లతో ఏర్పాటు చేసిన గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు. పీడబ్ల్యూ కార్యాలయం వద్ద నాలుగు చేతులతో వినాయక విగ్రహాలను, వైఎంఆర్‌ కాలనీ అరవిందాశ్రమంలో అశ్వవాహనంపై గణనాథుడు, సరస్వతి విద్యామందిరం రోడ్డులో సిద్ది, బుద్ధిలతో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా పట్టణంలో కొన్ని విగ్రహాలను కామనూరులోని కుందూ నదిలో నిమజ్జనానికి తరలించారు. బొల్లవరం బాకరాపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కుందూ నదిలో నిమజ్జనం చేశారు.

నిమజ్జనం వద్ద ఉచిత వైద్యశిబిరం

ప్రొద్దుటూరు రూరల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గణేశ నిమజ్జనంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కామనూరు వద్ద ప్రవహిస్తున్న కుందూ నది వంతెనపై వైద్య సిబ్బంది ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు రూరల్‌ ఎస్‌ఐ కె.రాజు పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ హనీఫ్‌బాబా నేతృత్వంలో ఆప్తాల్మిక్‌ అధికారి తేజ, సూపర్‌వైజర్‌ బి.ఎ.వరప్రసాద్‌ , సీహెచ్‌వో మెర్సీ, ఏఎన్‌ఎంలు యశోధ, హేమ, ఝాన్సీ, ఆశా కార్యకర్తలు బిందు, ప్రభావతి పాల్గొన్నారు.

మైదుకూరు రూరల్‌లో: మైదుకూరు పట్టణం లో గణేశ విగ్రహాల నిమజ్జనం శుక్రవారం ఘ నంగా నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినా యక విగ్రహాలను అల్లడుపల్లె సమీపంలోని కుందూ నదిలో నిమజ్జనం చేశారు..భక్తులు విగ్రహాల వెంట బాణసంచా కాల్చుతూ, రంగులు చల్లు కొంటూ, బ్యాండ్‌ బాజాల మధ్య గణనాఽథుల నిమజ్జనం కుందూ నదిలో చేశారు. డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌, సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐలు చిరంజీవి, సుబ్బారావులు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేశారు.గణపతి మహోత్సవ కమిటీ అధ్యక్షు డు న్యాయవాది కామనూరు శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

పెద్దముడియంలో: మండలంలో వినాయక నిమజ్జన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరి గింది. మండలంలో సుమారు 80 వినాయక విగ్రహాలను మండపాల్లో మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఆయా గ్రామాలకు చెందిన ప్ల్రజలు శుక్రవారం బాణ సంచా పేలుస్తూ రంగులు చల్లుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. మండలంలోని నెమళ్లదిన్నె వంతెన, పెద్దముడియం వంతెన వద్ద నిమజ్జనం చేశారు. జమ్మలమడుగు, మైలవరం, ఇతర మండలా లకు చెందిన విగ్ర హాలు పెద్దముడియం కుందూలో నిమజ్జనం చేశారు. పెద్దముడియం బ్రిడ్జి వద్ద రూరల్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ సుబ్బా రావులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దారు బాలనర సింహ, రెవెన్యూ సిబ్బం ది ఏర్పాట్లను పర్య వేక్షించారు. అగ్నిమాపక , వైద్య శాఖ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.

అట్లూరులో : మండలంలోని 74 మండపాల్లో వినాయకుడు కొలువుదీరగా మూడో రోజు శుక్ర వారం 55 వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశా రు. వేమలూరు సమీపంలో సగిలేరు వంతెనపై నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగిందని అట్లూరు ఎస్‌ఐ రామక్రిష్ణ తెలిపారు. ఆకు తోటపల్లెలో బోవిళ్ల చిన్ననరసింహారెడ్డి లడ్డు లక్ష రూపాయలుకు వేలంలో దక్కించుకున్నారు. చిన్నరాజుపల్లెలో గంగాగిరిరాజు రూ.85వేలకు వేలం పాటలో లడ్డును దక్కించుకున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:07 AM