విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సర్వీస్ ప్రారంభం
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:24 PM
మోటకట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రాయచోటి నుంచి మోటకట్ల జిల్లా జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు నూతన బస్ సర్వీ్‌సను శుక్రవారం టీడీపీ నాయకుడు శివప్రసాద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయు డు చప్పిడి పద్మజ ప్రారంభించారు.
సంబేపల్లె, జూన20(ఆంధ్రజ్యోతి): మోటకట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రాయచోటి నుంచి మోటకట్ల జిల్లా జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు నూతన బస్ సర్వీ్‌సను శుక్రవారం టీడీపీ నాయకుడు శివప్రసాద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయు డు చప్పిడి పద్మజ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు రాయచోటి నుంచి ప్రారంభమై వయా నారాయణరెడ్డి, ఎన్జీఆర్ కాలనీ, ముదినేనివడ్డెపల్లె మీదుగా మోటకట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లే కుండా చదువుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలను దత్తత తీసుకున్న డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ బడిఈడు పిల్లలకు టీసీలు లేకపోయినా పాఠశాలల్లో చేర్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చప్పిడి పద్మజ, పంచాయతీ కార్యదర్శి సురేశ, పేరెంట్స్ కమిటీ చైర్మన పెంచలమ్మ, గ్రామ నాయకులు అమర్‌నాథరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.