Share News

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:41 PM

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ జిల్లా వైద్యాధికారిణి గీత ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కోడిగాండ్ల పల్లెలో వైద్యశిబిరాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచవో గీత

ముద్దనూరు సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి):సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ జిల్లా వైద్యాధికారిణి గీత ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని కోడిగాండ్లపల్లెలో లార్వా, ఫీవర్స్‌ సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌వో గీత ఆకస్మిక తనిఖీ చేసి గ్రామంలో పర్యటించారు. ఇళ్ల వద్ద పారిశుధ్య లోపం లేకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండండి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు వందశాతం ఉండేలా చర్యలు చేపట్టడంతోపాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి మనోరమ ఆరోగ్య సిబ్బందికి సూచించారు.ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆర్‌సీహెచ్‌(తల్లి, బిడ్డ) ప్రొగ్రాంను ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా గర్భిణుల నమోదు, కాన్పులు, వ్యాధినిరోధక టీకాలు తదితర వాటి పై ఆరాతీశారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్‌ అధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కరీష్మా, కమ్యూనిటీ హెల్త్‌ అధికారి ప్రసాద్‌యాదవ్‌, ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరెడ్డి,ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాసన్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:41 PM