ఈదురు గాలులకు నేలవాలిన అరటితోటలు
ABN , Publish Date - May 01 , 2025 | 11:44 PM
మండ లంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు బాలాయపల్లె అరటి రైతులకు శాపంగా మారయి.
కాశినాయన మే20(ఆంధ్రజ్యోతి): మండ లంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు బాలాయపల్లె అరటి రైతులకు శాపంగా మారయి. అడు గంటిన భూగర్భ జలాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ అతికష్టంమీద కాపాడు కుంటూ వచ్చిన అరటి తోటలు ఒక్క గాలి దెబ్బకు నేలవాలిపోవడంతో రైతులు అభోదిబోమంటున్నారు. లక్షలు పెట్టుబడు లు పెట్ట్టి సాగుచేసిన అరటి తోటలు గాలికి తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వమే అర టి రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతఉన్నారు. గురువారం నాటి గాలికి ఉప్పలూరులో కరెంట్ స్తంభాలు పడిపోవడంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది.