‘బలిజలను బీసీలో చేర్చాలి’
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:59 PM
రాష్ట్రంలోని బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ రిజర్వేషన సాధక క మిటీ నాయకులు సా నా ప్రసాద్ డిమాండ్ చేశారు.

నందలూరు, జూన 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ రిజర్వేషన సాధక క మిటీ నాయకులు సా నా ప్రసాద్ డిమాండ్ చేశారు. బలిజలను బీసీ కులాల్లో చేర్చాలంటూ చిత్తూరు నుంచి అమరావతికి 15 మంది బృందంతో బీసీ రిజర్వేషన సాధక కమిటీ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నందలూరుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక బలిజ నేతలు పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నేతలు కాంట్రాక్టర్ బుశెట్టి వెంకటసుబ్బయ్య,నాగరాజు, ఉప్పుశెట్టి సుధీర్, కొట్టే శ్రీహరి, నారపుశెట్టి శివయ్య, ఉప్పుశెట్టి రెడ్డయ్య, పాటూరు రమేష్, జంగంశెట్టి హరి, బీమా మునుస్వామి, బాలాంజనేయులు, పసుపులేటి సుబ్రమణ్యం, మస్తాన, శ్రీరాం, హరినాథ్ పాల్గొన్నారు.