Share News

బి.మఠానికి బస్టాండు ఎప్పుడో..?

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:37 PM

ఆధ్యాత్మిక కేంద్రం ప్రము ఖ పుణ్యక్షేరత్రమైన బ్రహ్మంగారిమఠం మండలానికి బస్టాండ్‌ ఎప్పుడోనంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

బి.మఠానికి బస్టాండు ఎప్పుడో..?
బస్టాండ్‌ లేక బస్సుల కోసం రోడ్లపై వేచి ఉన్న భక్తులు

బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఆధ్యాత్మిక కేంద్రం ప్రము ఖ పుణ్యక్షేరత్రమైన బ్రహ్మంగారిమఠం మండలానికి బస్టాండ్‌ ఎప్పుడోనంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గతంలో బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల సెంట రులో పురాతన బస్‌షెల్టరు ఉండేది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో ఆ బస్‌షెల్టరు తొలగించి నూతనంగా ఏర్పా టు చేద్దామని చెప్పి మాటతప్పారు. దీంతో దాదాపుగా నాలుగు సంవత్సరా లు ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ మద్విఆరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేం ద్రస్వామి సపజీవసమాధి నిష్ఠ వహించిన ఆధ్యాత్మిక కేంద్రానికి బస్టాండు లేక రాష్ట నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇక్కట్లుపడుతున్నారు. తమ వాహనాలను ఎక్కడ నిలబెట్టుకో వాలి, ప్రయాణం చేసేటప్పుడు ఎక్డ్కడ వేచి ఉండాలన్న విషయంపై భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల వర్షాకాలంలో యాత్రి కులు, భక్తులు బస్టాండ్‌ లేక చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ రూ.10 లక్షల వ్యయంతో తాత్కాలిక బస్‌ షెల్టరు నిర్మాణాన్నిచేపట్టాలని స్థానిక టీడీపీ నేతలకు తెలిపినప్పటికీ వారు బస్‌షెల్టరు నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇదలా ఉంటే వానకు, ఎండకు భక్తులు రోడ్లపైనే బస్సుల కోసం గంటల తరబడి నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉం టే గత పది సంవత్సరాలక్రితం బ్రహ్మంసాగర్‌ వెల్లే మార్గమధ్యంలో ప్రభు త్వ స్థలం ఏడు ఎకరాలకు పైగా ఉండగా అందులో శాశ్వతంగా బస్టాండు నిర్మాణాన్ని చేపడితే బాగుంటుందని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికలను రూపొం దించారు. అయితే దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆ స్థలంలో బస్టాండునిర్మాణ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బ్రహ్మంగారిమఠానికి బస్టాండు నిర్మాణ పనులు రావచ్చని యాత్రికులతోపాటు స్థానిక ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. ప్రభు త్వ స్థలం రోజురోజుకూ ఆక్రమణకు గురవుతూ ఉందని, వెంటనే గతంలో కేటాయించిన ఆ స్థలంలో శాశ్వతంగా బస్టాండున నిర్మాణ పనులు చేపట్టి ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠానికి బస్టాండును ఏర్పాటు చేయా లని లేకుంటే ఆస్థలం కూడా కబ్జాదారుల కబంధహస్తాల్లోకి వెళితే ఇబ్బందు లు ఏర్పడుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బస్టాండ్‌ నిర్మాణానికి చొరవచూపా లని కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:37 PM